Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి ఆర్‌ఐఓకు డీఎస్‌ఎఫ్ వినతిపత్రం

02-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్‌ఐఓ)కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కళాశాలలను గుర్తించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి ఆర్‌ఐఓకు డీఎస్‌ఎఫ్ వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News