Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించాలి

అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించాలి

అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించాలి
29-12-2025 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ కు సూర్యాపేట జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

సూర్యాపేట, స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట కలెక్టరేట్ : తెలంగాణ

ప్రభుత్వం మీడియా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన జీవో 252 ను సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా సమన్వయ కమిటీ సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడారు. అక్రిడిటేషన్ల జీవో 252 లో అభ్యంతరాలను సవరించాలని సూచించారు. డెస్క్ జర్నలిస్టులకు, రిపోర్టర్లకు వేర్వేరు రకాల కార్డులు జారీ చేయడం పట్ల ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.అదే విధంగా వార, పక్ష,మాస దినపత్రికల అర్హతకు సంబంధించి జారీ చేసిన నిబంధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. వార పత్రికలకు కనీసం 45 సంచికలు పక్షపత్రికలకు కనీసం 22 సంచికలు, మాసపత్రికలకు కనీసం 11 సంచికలు సమర్పించాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. ఈ విధానం పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, న్యాయమైన జర్నలిస్టులను తొలి దశలోనే వృత్తికి దూరం చేసేందుకు ఈ జీవో తోడ్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దినపత్రికలు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(పీఆర్ జీఐ) నుండి సర్టిఫికెట్ దాఖలు చేయాలనే నిబంధన చేర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. కేబుల్ చానళ్ళకు విధించిన కఠినమైన నిబంధనను సడలించాలని సూచించారు. జీవో 252

పాత్రికేయులపై సెన్సార్షిప్ విధించినట్లుగా ఉందని వారు పేర్కోన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వారిలో సూర్యాపేట జిల్లా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో- కన్వీనర్లు ముషం హరి ప్రసాద్, లింగాల సాయిబాబా, తాందార్ పల్లి శ్రీనివాస్, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్ (ప్రభు), కొంగల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News