Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Updated : 06 Apr 2026 19:27 IST
As Preferred Source 1 min read
ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

జాతీయ స్థాయిలో జరిగిన ఐఎన్టిఎస్ఓ (అంతర్జాతీయ టాలెంట్ చర్చ్ ఒలంపియాడ్) పోటీ పరీక్షలలో కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచినారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల బృందం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు, మెమొంటోలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు విద్య తో పాటు వ్యాయామం కూడా అవసరమని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉంటూ మీ లక్ష్యాన్ని సాధించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. విజేతలుగా మొదటి బహుమతి లాప్టాప్ ను రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లు గెలుపొందారు. రెండవ బహుమతి ట్యాబ్ ను ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తోపాటు చాలామంది విద్యార్థులు బహుమతులు సాధించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఈజిఎం మురళీకృష్ణ బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్స్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్, కోఆర్డినేటర్ వెంకట్, డీన్స్, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news