Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం

27-01-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ ఖైసర్‌ను నియమించినట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు తెలిపారు.

బషీరాబాద్‌లో నిర్వహించిన ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి–2026 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించి ఖైసర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నవోదయ సిద్దు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ రంగంలో ఖైసర్ అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖైసర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ నవోదయ సిద్దు, రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ డిగ్గే బాబు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు న్యాయం అందేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News