Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

09-04-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్‌

స్థానిక పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ రత్నం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం అభినందనీయమని చౌటుప్పల్ తహసీల్దార్ పేర్కొన్నారు. గురువారం చౌటుప్పల్‌లో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించ తలపెట్టిన ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్ ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ అవగాహన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక, వైద్య విద్యా కోర్సులకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. రత్నం ఫౌండేషన్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెగా గ్రాండ్ టెస్ట్ ద్వారా పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ వివరాలను గ్రాండ్ టెస్ట్ ఉద్దేశాన్ని నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో ​యు. మల్లేష్ (రత్నం ఫౌండేషన్ చైర్మన్)​దబ్బటి శేఖర్ (యాదాద్రి ఆర్.టి.ఐ. జిల్లా అధ్యక్షుడు)రామయ్య, మల్లేష్, సనా, అధ్యాపక బృందం

​మహేందర్, ఇతర ఫౌండేషన్ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News