Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

అహోబిలంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం

23-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎగువ–దిగువ క్షేత్రాల్లో ఏకకాలంలో ఉత్సవాలు – అరుదైన ఆచార వైభవం

ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా:

ఫాల్గుణమాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో శ్రీలక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. నవనారసింహ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన అహోబిలంలో ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

పురాణప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రంలో నరసింహస్వామి నవనారసింహ రూపాల్లో తొమ్మిది ప్రాంతాల్లో వెలిసినట్లు స్థల పురాణాలు పేర్కొంటాయి. అందుకే అహోబిలాన్ని “నవనారసింహ క్షేత్రం”గా పిలుస్తారు. ఫాల్గుణమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు దాదాపు 45 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి.

ఒకే క్షేత్రంలో రెండు బ్రహ్మోత్సవాలు – దేశంలో అరుదైన సంప్రదాయం

అహోబిలం ప్రత్యేకతల్లో ప్రధానమైనది ఎగువ, దిగువ క్షేత్రాల్లో ఏకకాలంలో బ్రహ్మోత్సవాలు జరగడం. కొండపై ప్రళయభీకర రూపంలో వెలిసిన అహోబిలేశుడికి ఎగువ అహోబిలంలో, భక్తులను అనుగ్రహించే ప్రహ్లాదవరదుడికి దిగువ అహోబిలంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒకరోజు ముందు ఎగువలో అంకురార్పణ జరగగా, మరుసటి రోజు దిగువలో ఉత్సవాలు ఆరంభమవుతాయి.

వాహనసేవలతో ఆధ్యాత్మికోత్సాహం

అంకురార్పణ అనంతరం ప్రతిరోజూ స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సింహ, హంస, సూర్యప్రభ, హనుమంత వాహనసేవలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ సందర్భంగా జరిగే రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిలుస్తుంది. ఆ రోజు స్వామివారు ‘తులువ ముడి’ అనే ఎర్రటి తలపాగా ధరించి వేంచేస్తారు. అమ్మవారు ‘సారీ’ అనే జడకొప్పుతో రథంపై దర్శనమిస్తారు.

చెంచుల ఆచార విశిష్టత – గరుడవాహనంతో ముగింపు

బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామివారు గరుడవాహనాన్ని అధిరోహిస్తారు. ఈ సందర్భంగా చెంచు భక్తులు తలపై కట్టెలను పొయ్యిలా పేర్చి మంటలతో ప్రదక్షిణ చేయడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. గరుడవాహనం ఆలయానికి చేరుకోగానే ధ్వజావరోహణం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

ఆధ్యాత్మిక వైభవం, విశిష్ట ఆచార సంప్రదాయాల సమ్మేళనంగా అహోబిల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి.

Sthanikam

అహోబిలంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News