Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్

06-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. కల్తీ ఆహారం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో “ఈట్ రైట్–స్టే హెల్తీ” పేరుతో నిర్వహించిన వాక్‌థాన్‌ను క్లాక్‌టవర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆహార భద్రత శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఆహారంతో పాటు వ్యాయామం కూడా దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. కల్తీ ఆహారాన్ని గుర్తించి వెంటనే ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

నల్గొండ పట్టణంలో సుమారు 100 మంది వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ శాఖ ద్వారా లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యాపారులు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

ఈ నెల 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న “ఆరోగ్య వారోత్సవం”లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రచార వాహనం ద్వారా పది రోజుల పాటు జిల్లాలో పర్యటించి కల్తీ ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆహార భద్రత అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News