Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

ఆగిరిపల్లి హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్

23-02-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎస్‌ఐ కె. శుభశేఖర్ చాకచక్యంతో పట్టుబడిన ఏ-3 నిందితుడు

ఆగిరిపల్లి : పరిధిలో నమోదైన హత్య కేసులో గత 12 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నం. 20/2009, సెక్షన్లు 302, 120(బి) ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద నమోదు అయిన కేసులో ఏ-3 నిందితుడు అలవాల బాబ్జీ @ బాబీని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన అలవాల బాబ్జీ (తండ్రి: నరసింహమూర్తి) 2014లో బెయిల్‌పై విడుదలై, అనంతరం కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

కేసు నమోదు సమయంలో ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ముద్దాయి తన పేరు మారుస్తూ, ముద్దు పేర్లతో జీవనం సాగించినట్లు విచారణలో తేలింది. అలవాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు తదితర పేర్లతో గుర్తింపును మార్చుకుంటూ పోలీసులను తప్పించుకుంటూ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్‌ఐ కె. శుభశేఖర్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చేపట్టారు. గుంటూరు సమీపంలోని దాసరిపాలెం గ్రామంలో అలవాల వెంకటేశ్వర్లు పేరుతో నివసిస్తున్న వ్యక్తిపై అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసుల కదలికలను గమనించిన అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

నిరంతర గాలింపు చర్యలలో భాగంగా గుంటూరు పట్టణంలోని పాత సుజాత కాన్వెంట్, శనివారపేట ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతడే అలవాల బాబ్జీ @ బాబీ @ వెంకటేశ్వరరావు @ వెంకటేశ్వర్లు అని నిర్ధారించారు.

దాదాపు 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ కె. శుభశేఖర్ తెలిపారు.

Sthanikam

ఆగిరిపల్లి హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News