Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు
21-03-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక ప్రార్థనలు… ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చేర్మెన్

ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర పర్వదినం రంజాన్ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయాన్నే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలను ముగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ… నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రార్థనలు చేసిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, బాబా షరీఫ్, ఎండి కరీం, పెద్దగొని రమేష్ గౌడ్, ఎండి ఎజాస్, వహీద్, గణేష్, చింటూ, సంతోష్, శివ, అజయ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News