నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ అంగన్వాడి కేంద్రాలకు ఎస్బిఐ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రీస్కూల్ మెటీరియల్ అందజేశారు. ఎల్ఈడి టీవీ, రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, స్టీల్ పాత్రలు, వర్క్ బుక్స్, నోట్స్, పెన్సిల్స్, ఆట వస్తువులు తదితర సామాగ్రి పంపిణీ చేశారు.
మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ ఈ సామాగ్రి చిన్నారుల విద్య, పోషణ, అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్ క్రాంతి కుమార్, సర్పంచ్ మహేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి