Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా మడకశిర ఎమ్మెల్యే

10-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మడకశిర నియోజకవర్గంలో అంగన్వాడీలకు ఏ సమస్య వచ్చినా అన్నయ్యగా నేను ఉన్నాననే విషయాన్ని మరచిపోవద్దు అని స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మరియు శ్రీసత్యసాయిజిల్లా టీడీపీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు హామీ ఇచ్చారు. మడకశిరలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం అంగన్వాడీలతో సమావేశాన్ని ఎం.ఎస్.రాజు నిర్వహించారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతూ.

అంగన్వాడీ ల సమస్యలపై కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. అంగన్వాడీలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వేధించింది, వారి సమస్యలపై నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు చనిపోతే వారికి దహన సంస్కారాల కోసం రూ.15,000 అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. పదవీ విరమణ చేసిన అనంతరం అంగన్వాడీలకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంగన్వాడీల శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు,యువనేత నారా లోకేష్అంగన్వాడీల సమస్యలను రెండు నెలల్లోపు పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు. మీకు నేను అందుబాటులో లేకపోతే.నేను పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు ధర్నాలు, నిరసనలు చేయండి. కానీ మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని మరచిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు యువమంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని అంగన్వాడీలకు ఎం.ఎస్.రాజు భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం అంగన్వాడీలకు ఎం.ఎస్.రాజు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి, స్వయంగా అంగన్వాడీలకు తానే భోజనం వడ్డించారు. వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. తమను ఈ విధంగా పిలిచి, ధైర్యం చెప్పి, భోజనం పెట్టి, తమ సమస్యలన్నీ విన్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకు అంగన్వాడీలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

Sthanikam

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా మడకశిర ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News