Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

ఆదోనిలో శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు. 19 నుంచి 22 వరకు ప్రవచనాలు, భజనలు

18-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని వసంత టాకీస్‌ సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఇందులో భాగంగా ఇస్కాన్‌ ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్‌ ధార్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారని చెప్పారు. స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.

22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ, కుంకుమార్చన ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేంద్రకర్‌ లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు జె.ఈశ్వరరావు, కార్యదర్శి జవేల్కర్‌ బాబురావు, సంయుక్త కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, కోశాధికారి పతంగి నరసింగరావు, వడే రఘు, సూత్రవే ఆనంద్‌, సరోదే వెంకోబరావు, ఆదోని తితిదే కళ్యాణ మండపం సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు. 19 నుంచి 22 వరకు ప్రవచనాలు, భజనలు

Article Image

ఆదోని, : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని వసంత టాకీస్‌ సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఇందులో భాగంగా ఇస్కాన్‌ ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్‌ ధార్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారని చెప్పారు. స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.

22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ, కుంకుమార్చన ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేంద్రకర్‌ లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు జె.ఈశ్వరరావు, కార్యదర్శి జవేల్కర్‌ బాబురావు, సంయుక్త కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, కోశాధికారి పతంగి నరసింగరావు, వడే రఘు, సూత్రవే ఆనంద్‌, సరోదే వెంకోబరావు, ఆదోని తితిదే కళ్యాణ మండపం సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News