Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

14-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.

దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.

Sthanikam

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

Article Image

ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.

దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News