Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

ఆదివాసీలను అంతం చేయాలనే ఫాసిస్ట్ ప్రభుత్వ కుట్రలను ఎండ కట్టండి; పేర్ల నాగయ్య,

20-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కర్రెగుట్టలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని సి.పి.ఐ(ఎం-ఎల్ )మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2026 మార్చ్ 31 వరకు దేశాన్ని నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటనలు చేస్తూ, కర్రెగుట్టలో కొన్ని వేల మంది సైన్యాన్ని దింపి, వందలాది క్యాంపులు నిర్వహిస్తూ, నక్సల్స్ పేరుతో ఆదివాసి బిడ్డలను హత్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నరమేధాన్ని వెంటనే ఆపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దండకారణ్య బస్తరు జిల్లాలలో విస్తారంగా లభించే సహజ ఖనిజ సంపద,అడవి సంపదను అంబానీ,ఆదానీలకు దోచిపెట్టుట కొరకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే నక్సల్స్ పేరుతో ఆదివాసి బిడ్డలను హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అక్కడి ప్రజలు ఏమైనా దేశద్రోహానికి పాల్పడ్డారని అనుమానం కలిగితే భారత రాజ్యాంగం ప్రకారం వారిని శిక్షించాలి కానీ, శత్రు దేశాల సైన్యాల మీద యుద్ధం చేసినట్లుగా సొంత ప్రజల మీద యుద్ధం చేయడం ఫాసిస్టు విధానమని ఆయన అన్నారు. ఈ నరమేధాన్ని వెంటనే ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ ఈ నర మేధాన్ని ఖండించాలన్నారు

Sthanikam

ఆదివాసీలను అంతం చేయాలనే ఫాసిస్ట్ ప్రభుత్వ కుట్రలను ఎండ కట్టండి; పేర్ల నాగయ్య,

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News