Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:31 PM

ఆధునిక వ్యవసాయంతో ఆదాయం పెంపు – కలెక్టర్ సూచనలు

24-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వర్షాధారిత పథకాల ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో అమలవుతున్న వర్షాధారిత అభివృద్ధి పథకాన్ని మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైతులకు అందిస్తున్న పరికరాలు, రాయితీల వినియోగాన్ని సమీక్షిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతు కూర్మ కొమురయ్య కూరగాయల పొలాన్ని సందర్శించి, పథకం కింద అందించిన పరికరాల వినియోగాన్ని పరిశీలించారు. రైతులు పొందుతున్న లాభాలపై కలెక్టర్ నేరుగా వివరాలు తెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు అనుసరిస్తే దిగుబడులు పెరిగి ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. వర్షాధారిత పథకం కింద 115 మంది లబ్ధిదారులకు సుమారు రూ.32.10 లక్షల విలువైన పరికరాలు, రాయితీలు అందించామని చెప్పారు. ఇందులో ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్స్, తేనెటీగల పెంపక బాక్సులు వంటి పరికరాలు ఉన్నాయని వివరించారు.రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకుని పంటలను సమిష్టిగా విక్రయించాలి, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగిస్తే రైతులకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధునిక వ్యవసాయంతో ఆదాయం పెంపు – కలెక్టర్ సూచనలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News