Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:50 AM

అధికార పార్టీయే అభివృద్ధికి మార్గం

అధికార పార్టీయే అభివృద్ధికి మార్గం

అధికార పార్టీయే అభివృద్ధికి మార్గం
07-02-2026 260 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్‌తోనే మున్సిపాలిటీల ప్రగతి

పంతంగి గెలిస్తే వార్డును దత్తత తీసుకుంటా

ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హామీ

అధికార పార్టీయే అభివృద్ధికి బాటలు వేస్తుందని, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కుడకుడ స్నేహనగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ సందర్భంగా 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. నాలాలను ఆక్రమించి భూములను కబ్జా చేసిన వారిపై ఎన్నికల అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. స్థానికుడైన పంతంగి దశరథ గౌడ్‌ను గెలిపిస్తే 14వ వార్డును దత్తత తీసుకొని ప్రత్యేక అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ మాట్లాడుతూ, వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కరోనా సమయంలోనే కాకుండా ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, గోదల రంగారెడ్డి, రాజేష్ నాయక్, లక్ష్మయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

అధికార పార్టీయే అభివృద్ధికి మార్గం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News