Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:25 AM

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

07-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి R.గంగవతి (రాజశేఖర్) గారికి మద్దతుగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో DCC కార్యదర్శి, మాజీ ZPTC K.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 23వ వార్డు అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత కరెంట్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచి 23వ వార్డు అభ్యర్థి గంగవతి (రాజశేఖర్) గారిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ (సర్పంచ్–చినిగేపల్లి), M.రమేష్ (సర్పంచ్–చిక్కుర్తి), PACS చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News