Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:17 AM

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

06-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

Article Image

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News