Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

02-06-2026 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామ ప్రజలకు సర్పంచ్ కునూర్ సాయి కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

పరిశుభ్రమైన బోగారం లక్ష్యంగా ప్రతి ఇల్లు, ప్రతి వీధిని పచ్చదనంతో నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో బోగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బోగారం గ్రామం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

Article Image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామ ప్రజలకు సర్పంచ్ కునూర్ సాయి కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

పరిశుభ్రమైన బోగారం లక్ష్యంగా ప్రతి ఇల్లు, ప్రతి వీధిని పచ్చదనంతో నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో బోగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బోగారం గ్రామం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News