Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా

ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా

ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా
15-03-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య శంకుస్థాపన

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య అన్నారు. ఆదివారం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. గ్రామాన్ని అంచెలంచెలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, వార్డు సభ్యులు తీగుళ్ల శ్రీనివాస్, మేకల ముత్తమ్మ, సిలువేరు పుష్పలత, ఎరుకల కల్పన, చెక్క శివ, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బక్క శ్రీనాథ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్క కిషన్, మాజీ సర్పంచ్‌లు పెంటయ్య, వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దోర్నాల సోమలింగం, బక్క మల్లయ్య, బక్క నరసింహ, తీగల లక్ష్మయ్య, చెక్క లింగస్వామి, చెక్క రాజు, మల్లేష్, గోపాల్, శంకరయ్య, నూనె శీను, నర్సింహ్మ, పంచాయతీ కార్యదర్శి సురేష్, కారోబార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News