Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:16 AM

అడ్డగుడుర్‌లో ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ శంకుస్థాపన: నైపుణ్యాభివృద్ధికి కొత్త ఊపు

31-12-2025 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి స్థానికం ప్రతినిధి

తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగుడుర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ ఈ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు. ఆయనతో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీఐ, ఏటీసీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపనతో అడ్డగుడుర్ ప్రాంతంలో సాంకేతిక విద్యకు కొత్త ఊపొచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Sthanikam

అడ్డగుడుర్‌లో ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ శంకుస్థాపన: నైపుణ్యాభివృద్ధికి కొత్త ఊపు

Article Image
యాదాద్రి స్థానికం ప్రతినిధి

తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగుడుర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ ఈ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు. ఆయనతో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీఐ, ఏటీసీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపనతో అడ్డగుడుర్ ప్రాంతంలో సాంకేతిక విద్యకు కొత్త ఊపొచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News