Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

09-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ, ఏప్రిల్‌ 9: ABN ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీచరణ్ డీఎస్పీని కోరారు. గురువారం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏప్రిల్‌ 4న ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవమానకర, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధంగా, ఆధారరహిత వ్యాఖ్యలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ప్రసారాలు సమాజంలో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కాబట్టి, కార్యక్రమానికి బాధ్యులైన నిర్వాహకులు, యాంకర్, ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్టు తెలిపారు. అలాగే ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

Sthanikam

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News