Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సేవే లక్ష్యం బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

07-02-2026 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13 వ వార్డులో గడపగడపకు తిరిగి చేయి గుర్తుకు ఓట్ల అభ్యర్థన

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యమని వార్డు ఇన్చార్టులు వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్ అన్నారు. శనివారం వార్డులో గడపగడపకు తిరుగుతూ చేతి గుర్తుపై ఓటు వేసి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను గెలిపిస్తే వార్డు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందుతుందని తెలిపారు. పేద కుటుంబాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇప్పటికే సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అభివృద్ధి కొనసాగాలంటే 13వ వార్డు ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్న బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తొర్పునూరి బాబు, వార్డు ఇన్చార్డులు మస్తాన్ బాబు, దేప శ్యాంసుందర్ తో పాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సేవే లక్ష్యం బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News