Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

28-12-2025 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

Sthanikam

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News