Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు

14-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

40 మందితో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వలిగొండ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించగా, సుమారు 40 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా, సమాజంలోని అన్ని పీడిత వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్తగా దేశానికి దిశానిర్దేశం చేశారని అన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన నుంచి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమనికొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోదుల లింగస్వామి, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల శేఖర్, మాజీ కౌన్సిలర్ కొరగొని లింగస్వామి, సీనియర్ నాయకులు బోదుల నర్సింహా, ఆరుట్ల యాదయ్య, ఉదరి యాదయ్య, బోయ రామచంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, యువజన సంఘం సభ్యులు నరేష్, శంకర్, స్వామి, శ్యామ్, గణేష్, రాజు, సాయి జీవన్, విగ్నేష్, రాకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News