Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:08 PM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం

09-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బషీరుద్దీన్ జయంతి సందర్భంగా అంబేద్కర్ వర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం

పాత్రికేయ ప్రపంచంలో మహిళల పాత్రపై చర్చ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహణ

జర్నలిజంపై మహిళల ప్రభావం

హైదరాబాద్

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలో స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా “పాత్రికేయ రంగంపై మహిళల ప్రభావం” అనే అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్రికేయ శాస్త్ర విభాగం రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పద్మజా షా ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యాసం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పాత్రికేయ రంగంలో మహిళల ప్రస్థానం, వారి ఆలోచనా దృక్పథం, సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఈ ఉపన్యాసం దృష్టి సారించనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాత్రికేయులు, జర్నలిజం విభాగ విద్యార్థులు, పరిశోధకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ విద్యా, పాత్రికేయ రంగాలకు అందించిన సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ స్మారక కార్యక్రమం ఆలోచనాత్మకంగా సాగనుందని వారు తెలిపారు.

Sthanikam

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News