Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. గిరిజన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య.. ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణలు: వీసీ ఘంటా చక్రపాణి

02-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ‘సమాన అవకాశాల ప్రణాళిక’ కింద రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు తదితర వెనుకబడిన గిరిజన వర్గాల విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (PM-USHA) కింద సుమారు రూ.12.9 కోట్ల వ్యయంతో డీఆర్‌సీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొ. ఈ. సుధారాణి, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. పి. వెంకటరమణ, డా. బానోత్ ధర్మ,నాయక్ . జి. దయాకర్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. కె. కృష్ణారెడ్డి, ప్రొ. కె. ప్రమీల, డా. ఎ. రమాదేవి, ఎన్‌సీ వేణుగోపాల్, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. గిరిజన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య.. ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణలు: వీసీ ఘంటా చక్రపాణి

Article Image

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ‘సమాన అవకాశాల ప్రణాళిక’ కింద రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు తదితర వెనుకబడిన గిరిజన వర్గాల విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (PM-USHA) కింద సుమారు రూ.12.9 కోట్ల వ్యయంతో డీఆర్‌సీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొ. ఈ. సుధారాణి, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. పి. వెంకటరమణ, డా. బానోత్ ధర్మ,నాయక్ . జి. దయాకర్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. కె. కృష్ణారెడ్డి, ప్రొ. కె. ప్రమీల, డా. ఎ. రమాదేవి, ఎన్‌సీ వేణుగోపాల్, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News