Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

02-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి, బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమం బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు రొడ్డం బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా సామాజికంగా కుల వివక్షకు గురైన అస్పృశ్యులకు తమ పోరాటాల ద్వారా చైతన్యం కలిగించి, వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించిపెట్టిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.

రాబోయే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెనుకొండలో నిర్వహించే “జై భీమ్ ర్యాలీ” మరియు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే జయంతి సభలో రొద్దం మండలంలోని ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ అభిమానులు, బహుజన చైతన్య వేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ, రాయలసీమ ఉపాధ్యక్షులు ఈశ్వర్, గౌరవ అధ్యక్షులు మునుమడుగు నరసింహులు, జిల్లా గౌరవాధ్యక్షులు రంగేపల్లి కదిరప్ప, నాగేపల్లి రామకృష్ణ, గౌరాజ్‌పల్లి సురేష్, మారుతి, దొడగట్ట గోపాలు, కంచి సముద్రం గోవిందు, బుచర్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News