Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:30 AM

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ

30-12-2025 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం

జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కొత్త పంటల విస్తీర్ణం

మహబూబాబాద్, స్థానిక ప్రతినిధి బాలు ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు, మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో కురవి, సీరోల్, డోర్నకల్, నెల్లికుదురు, మహబూబాబాద్ తదితర మండలాల్లో రైతులు ఉల్లి సాగును చేపట్టి ఎకరానికి యాభై వేలకు పైగా ఆదాయం పొందుతున్నారని ముఖ్యంగా రైతులు నారు మొక్కలు పెంచి, 4 నుండి 6 వారాల నారును పలు జిల్లాలలో మార్కెట్లలో స్థానిక సంతలలో అమ్మి, మంచి లాభాలు పొందుతున్నారన్నారు. అదే విధంగా రైతాంగం మార్కెట్ డిమాండ్ ఉన్న ఉల్లి, వెల్లుల్లి, ధనియాలు, పుదీన, మునగ, మల్బరీ, అలాగే నూతన పంటలైన గాక్, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, స్థానిక పంటలు అయిన నిమ్మ, పనస, నేరేడు, సీతాఫలం, బోడ కాకర, దొండ, పొట్ల, కనకాంబరం, మల్లె, చామంతి, కాకినాడ గులాబీ, స్ప్రే రోసెస్, అన్ని రకాల ఆకు కూరలు మరియు మార్కెట్ డిమాండ్ ఉన్న పలు పంటలు పండించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపినారు. రైతులు ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేస్తూ, అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ, కూరగాయలు తదితర పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన మామిడి, జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, గాక్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలని అన్నారు.
Sthanikam

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News