Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

ఆత్మ స్తుతి పరనింద - ఆత్మ హత్య లాంటిదే: - రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్

ఆత్మ స్తుతి పరనింద - ఆత్మ హత్య లాంటిదే: - రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్

ఆత్మ స్తుతి పరనింద - ఆత్మ హత్య లాంటిదే: - రెడ్డిగూడెం  వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్
February 14, 2026 08:38 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రెడ్డిగూడెం: ఆత్మ స్తుతి పరనింద - ఆత్మ హత్య లాంటిదే అనే విషయం కూటమి నేతలకు తెలియదేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు కుటుంబ భజన మండలిలా ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు, విద్యార్థునుల అవస్థలు, రైతుల బాధలు, ఉద్యోగుల పడుతున్న ఇబ్బందులు ఇలా అనేకం ఉన్నాయని వాటిని పరిష్కారించకుండా కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి రెడ్ బుక్ పేరుతో రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దేశంలోనే

అప్పుల్లో( 18 నెలల్లో రూ.3.27 లక్షల కోట్లు ) ఏపీ టాప్‌ లో ఉందని

-‘కాగ్‌’ నివేదిక చెబుతుందనీ,

9 నెలల్లోనే బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పుల మోత బడ్జెట్‌ అప్పులు రూ.85,269 కోట్లు రాష్ట్ర పన్నుల రాబడికి మించి రుణభారం అమ్మకం పన్నుల రాబడి రూ.622 కోట్లు తగ్గుదల

ఇతర పన్నులు, డ్యూటీల్లో రూ.1,583 కోట్లు కొరత రూ.15,247 కోట్లు తగ్గిన కేంద్ర గ్రాంట్లు రూ.60,048 కోట్లతో రెవెన్యూ లోటు రెట్టింపుగా ఉందిని అన్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరం తొలి 9 నెలల బడ్జెట్‌

కీలక సూచికలను వెల్లడించిన ‘కాగ్‌’

రెవెన్యూ లోటు రెట్టింపుగా ఉండదనీ తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ అంచనాల అప్పు రూ.79,952 కోట్లు కాగా ఇప్పటికే (డిసెంబర్‌ నాటికి) గీత దాటి

రూ.85,269 కోట్లు అప్పులు చేసింది.

ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి

అదనంగా రూ.10 వేల కోట్లకు పైగా అప్పులు చేయడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి

డిసెంబర్‌ నాటికి రూ.74,163 కోట్లు కాగా

అప్పు ఏకంగా రూ.85,269 కోట్లకు ఎగబాకింది. మరోపక్క బడ్జెట్‌లో

మొత్తం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా పేర్కొనగా డిసెంబర్‌ నాటికే రెట్టింపు స్థాయిలో రూ.60,480 కోట్ల

రెవెన్యూ లోటులోకి రాష్ట్రం వెళ్లిపోయిందని కాగ్‌ గణాంకాలు

వెల్లడిస్తు­న్నా­యని తెలియజేసారు.

ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రా­నికి నిధులు తగ్గిపోయాయనీ.

2023–24 డిసెంబర్‌తో పోల్చితే

ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ వరకు

కేంద్ర గ్రాంట్ల రూపంలో నిధులు

ఏకంగా రూ.15,247 కోట్లు తగ్గిపోవడం గమనార్హం ఆవేదన వ్యక్తం చేశారు .

సంక్షేమానికి తూట్లు: 2023–24 డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ నాటికి ఇతర పన్నులు,

డ్యూటీల రూపంలో రావాల్సిన రాబడి రూ.1,583 కోట్లు తగ్గిపోయింది.

2023–24 ఆర్థిక ఏడాది డిసెంబర్‌ వరకు పోల్చితే.ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ నాటికి అమ్మకం పన్ను రాబడి

ఏకంగా రూ.6,22 కోట్లు తగ్గిపోయిందని కాగ్ నివేదిక చెబుతుందనీ,

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో

పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో

ఆంధ్రప్రదేశ్‌ 22వ స్థానంలో నిలిచి

చిట్ట చివరి నుంచి ఏపీ రెండో స్థానంలో ఉందని అమ్మకం పన్ను రాబడి క్షీణించడం అంటే ప్రజల కొను­గోలు శక్తి పడిపోవడమేనని స్పష్టం అవుతోంది అన్నారు. ఇక 2023–­24 డిసెంబర్‌ వరకు పోల్చి చూస్తే సామాజిక రంగ వ్యయం 2025–26 డిసెంబర్‌ నాటికి రూ.5,874 కోట్లు తగ్గిపోయింది.కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులతో ఏ అభివృద్ధి చేశారో చూపాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 - 2019 వరకు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటిఎమ్ లా వాడుకున్నారని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అని, ఇప్పుడు అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్లు రూపాయలు కూటమి నేతలు పంచుకుంటున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లాది బాబు, వైసీపీ నాయకులు సిహెచ్ ఇమ్మానుయేలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News