Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ఆరోగ్యానికి ‘కదలికే’ శ్రీరామరక్ష: గంటల తరబడి కూర్చోవడం ధూమపానం కన్నా ప్రమాదం!

05-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నిపుణులు డాక్టర్ శ్రీకరణ్ ఉద్దేశ్ హెచ్చరిక; జీవనశైలి మార్పులతోనే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్

నేటి యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బిపి) వంటి జీవనశైలి వ్యాధులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకరణ్ ఉద్దేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ‘కొత్త రకపు ధూమపానం’ లాంటిదని, ఇది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని ఆయన సూచించారు. ఆఫీసుల్లో పనిచేసే వారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని కాసేపు అటు ఇటు నడవాలి. ప్రతిరోజూ కనీసం 8,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోవాలి. వేగంగా నడవడమే శ్రేయస్కరం. వారానికి కనీసం 75 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం, అలాగే వారానికి రెండు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల దృఢత్వం) తప్పనిసరి. రోజుకు కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీర జీవ గడియారం క్రమబద్ధంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు సూచించారు. వంటల్లో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రెడ్ మీట్ (ఎర్ర మాంసం) తగ్గించి, మొక్కల ఆధారిత ప్రోటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్ చేసిన ఆహారం , అధిక కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వ్యాధి వచ్చాక చికిత్స కంటే రాకముందే మేల్కొనడం ఉత్తమమని డాక్టర్ ఉద్దేశ్ తెలిపారు. క్రమం తప్పకుండా ఫిజీషియన్‌ను సంప్రదించి హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని, తద్వారా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యానికి ‘కదలికే’ శ్రీరామరక్ష: గంటల తరబడి కూర్చోవడం ధూమపానం కన్నా ప్రమాదం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News