Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

07-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం – చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణకు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెంకటపూరం పరిధిలో ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డులో నెలకొన్న విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, సిసి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ప్రజలను మభ్యపెట్టిన పాలనకు ఈ ఎన్నికలే తగిన సమాధానం కావాలని అన్నారు. జెర్రీపోతుల సత్యనారాయణను గెలిపిస్తే 06వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Sthanikam

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News