Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:41 PM

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం
January 21, 2026 04:31 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డ


ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి:ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజున బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, "ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా" అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సంక్షేమ పాలన, ఆయన ప్రవేశపెట్టిన ప్రజాపథకాలే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన బలమని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, కెసిఆర్ కిట్టు, అలాగే వృద్ధులకు 2000 రూపాయలు, వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ వంటి చారిత్రాత్మక పథకాలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చాయని ఆయన గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని నమ్మకంగా నిలిచాయని, అదే నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కే ఓటు వేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరూ ఐక్యతతో పనిచేసి, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపి కే.ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, సంతోష్, సుజీత్ సింగ్ ఠాగూర్, సత్య ప్రకాష్, చిన్నారెడ్డి, గంగాధర్, మోయిన్, ఇమ్రాన్, మాలిక్ బాబా, అంజద్, రహామన్, షాకీర్ తదితర ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News