Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:21 PM

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

26-12-2025 360 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మండలపూజ

ఆలయాభివృద్ధికి రూ.10,116 విరాళం

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ మండలపూజతో పాటు స్వామివారి అభిషేక పూజ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ స్వామివారి విశిష్టత, భక్తి–నియమాల ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఆత్మనియంత్రణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.

మండలపూజ, అభిషేక పూజల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా కృషి చేశారు.

Sthanikam

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News