Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

ఆగిరిపల్లి లో రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి లో రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి లో రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి మంత్రి కొలుసు పార్థసారథి
January 20, 2026 08:27 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

స్వామి వారి కి తమ సొంత నగదు విరాళం,రూ.1,16,000లక్షల అందజేసిన మంత్రి పార్థసారధి


ఆగిరిపల్లి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి గ్రామంలో శోభనగిరిపై స్వయంభువుగా వెలసిన శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి వారి మాఘమాస రథసప్తమి

తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నడుంబిగించచారు. సందర్భంగా మాట్లాడుతూ.ఈ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించే మహా అన్నదాన మహోత్సవంలో సుమారు 20 వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఈ ఆలయాన్ని మంత్రి పార్థసారథి సారథ్యంలో అభివృద్ధి దిశగా నడిపిస్తూ, కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టి ఇప్పటివరకు సుమారు.రూ.3.50 కోట్ల వ్యయంతో శివాలయం వరకు మరియు మూడు గుండ్ల వరకు ఘాట్ రోడ్ అభివృద్ధి చేయించారు. దీని ద్వారా వృద్ధులు, దివ్యాంగులు కూడా సులభంగా కొండపైకి వెళ్లే విధంగా మార్గం సుగమమైంది.ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభమైన రథసప్తమి ఉత్సవాలు 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 2001 సంవత్సరం నుండి భక్తుల సహకారంతో నిరాటంకంగా కొనసాగుతున్న అన్నదాన కమిటీ ఇప్పటివరకు రూ.28 లక్షల 50 వేల నిధిని సమీకరించిందని, మంత్రి పార్థసారథి సలహా మేరకు ఈ నిధిని భక్తుల సౌకర్యార్థం ఏదైనా శాశ్వత నిర్మాణం గాని భోజనశాల కోసం వినియోగించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే ఈ మొత్తానికి తోడు ప్రభుత్వం నుండి గ్రాంట్ విడుదల చేయిస్తానని సభాముఖంగా మంత్రి హామీ ఇచ్చారు

ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి పార్థసారథి సొంత నగదు స్వయంగా అన్నదానానికి రూ.1,16,000/- విరాళంగా అందించారు.

అన్నదాన కమిటీ అన్ని పార్టీలను కలుపుకుని ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరగాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు. అన్నదానానికి కమిటీ ఏర్పాటు చేసి, వచ్చిన ప్రతి రూపాయికి పూర్తిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. రధ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.

రధ సప్తమి వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా నిర్వహించాలని అన్నారు.ముఖ్యంగా దర్శనం కోసం వచ్చే భక్తులకు త్రాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయాలు, మెడికల్ క్యాంపు, శానిటేషన్, ట్రాఫిక్ నిబంధనలు, అన్నీ దగ్గరుండి ఇటు కమిటీ సభ్యులు అటు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఆటంకం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశించిన మంత్రి. పోలీసు,రెవిన్యూ, వైద్య, ఆర్ & బి, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ, వారు నిరంతర పర్యవేక్షన్లతో సమన్వయంతో పనిచేసి వేడుకలు దిగ్వజయంగా నిర్వహించాలని అదేశించారు.మెడికల్ క్యాంపు, త్రాగునీరు స్టాల్స్, ఆల్ఫాహార స్టాల్స్ నాణ్యత ప్రమాణాలు పాటించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం దొంగతనాలు అరికట్టడానికి ప్రణాళికా బద్దంగా అంకితభావంతో పనిచేయాలని రక్షక సిబ్బందిని అదేశించారు.భక్తులు కానుకలు, విరాళాలు మరియు ఇతర మొక్కులు చెల్లించి రసీదులు పొందాలని, స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీసులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News