Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:39 AM

ఆగిరిపల్లి లో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ జెండా ఆవిష్కరించడం జరిగింది

12-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి లో

అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేశంలో మహిళలపై దాడులు తీవ్రస్థాయిలో పెరిగాయని, మహిళలపై దాడులు, హత్యాచారాలు, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు వారికి అండగా నిలబడుతూ వారిని పూలదండలతో సన్మానించడం ఆర్ఎస్ఎస్ – మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం మహిళలను మనువాద దృక్పథంతో చూస్తూ కించపరిచే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో తూచతప్పకుండా అనుసరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళా వ్యతిరేక చర్యలను విమర్శించారు. ప్రతి నెల మహిళలకు ఇస్తారన్న 1500 రూపాయలు హామీ, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానన్న హామీలను ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసారని ఆరోపించారు. ఈ చర్యలను మహిళలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణం మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి దోషులు కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని బక్కయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న మతతత్వ, మనువాద, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన "ఐప్వా" ఆధ్వర్యంలో తెనాలిలో "రాష్ట్ర సదస్సు" జరుగుతుందని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా "ఐప్వా" జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మీనా తివారి హాజరవుతున్నారని ఈ సదస్సులో అన్ని వర్గాల మహిళలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని, అలాగే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు పల్లె పాము భవాని, కలపాల రాణి ,రాధమ్మ ,మంగమ్మ, గంగ, లలిత, ఏసమ్మ, రాములమ్మ ,బూచమ్మ ,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆగిరిపల్లి లో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ జెండా ఆవిష్కరించడం జరిగింది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News