Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:20 AM

ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా

ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా

ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా
30-01-2026 360 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజల సేవకుడిగా నిలుస్తా

12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి రాపర్తి మహేష్ కుమార్ ధీమా

సూర్యాపేట సిటీ, తనను

ఆదరించి గెలిపించినట్లయితే 12వ వార్డును అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తూ ప్రజల నిజమైన సేవకుడిగా పనిచేస్తానని 12వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థి రాపర్తి మహేష్ కుమార్ స్పష్టం చేశారు.శుక్రవారం పిల్లలమర్రి ప్రాంతం నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన మహేష్ కుమార్ ఉత్సాహభరిత నినాదాల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీతో 12వ వార్డులో బిఆర్ఎస్ బలాన్ని మరోసారి చాటిచెప్పినట్లయ్యింది.

నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్లుగా పిల్లలమర్రి ప్రజలకు అండగా నిలుస్తూ వారి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేశానన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే నాయకుడిగా తాను గుర్తింపు పొందానని తెలిపారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలులో బిఆర్ఎస్ పాలన చరిత్ర సృష్టించిందని అన్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అభివృద్ధి – సంక్షేమమే తమ ఆయుధమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేసిన సేవలను ప్రజలు

గమనిస్తున్నారని, మరోసారి అవకాశం ఇస్తే 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, బిఆర్ఎస్‌కు ఓటు వేసి ఘన విజయం అందించాలని 12వ వార్డు ప్రజలను ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువజన విభాగం నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News