Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

కోదాడలో నైతిక విజయం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

16-12-2025 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
స్థానికం ప్రతినిధి ,కోదాడ:

కోదాడ నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బాధ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో మూడో వంతుకు పైగా ఓటమి పాల య్యారని, గెలిచిన వారిలో అధిక శాతం బీఆర్ఎస్ మద్దతుతోనే విజయం సాధించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రజలు తిర స్కరించారని వ్యాఖ్యానించారు.అధికార పార్టీ ప్రలోభాలు, భయభ్రాంతులకు లొంగకుండా బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను ఆయన అభినందించారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. మునగాల ఎన్నికల ఫలితాలే ఇందుకునిదర్శనమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపును కుట్రలతో నిలిపివేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మునగాల విషయంలో లెక్కింపు పునఃపరిశీలన లేదా ప్రజా విచారణకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నాయకత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.

Sthanikam

కోదాడలో నైతిక విజయం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News