Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు
16-12-2025 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచిగా ఘన విజయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పులిపలుపుల సునీత సర్పంచిగా ఘన విజయం సాధించారు. 303 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందడం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో సునీత భర్త వీరస్వామి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అదే కుటుంబానికి చెందిన సునీత ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుపు సాధించడం విశేషం. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న సునీత ఎన్నికల బరిలో నిలవాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెకు కలిసొచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మహిళా నాయకత్వానికి గ్రామస్తులు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై స్పష్టమైన హామీలతో ముందుకెళ్లిన సునీత విజయం లక్ష్మాపురంలో కొత్త ఆశలకు నాంది పలికింది

Sthanikam

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News