Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 08:54 PM

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన.  రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.
July 10, 2026 06:54 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల–భువనగిరి ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.339.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు డబుల్‌లైన్ రహదారుల అభివృద్ధి పనులకు ఆదివారం రామన్నపేటలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ తెలిపారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

మొత్తం 109.3 కిలోమీటర్ల మేర ఐదు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పున్న జగన్మోహన్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News