Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

“99 డేస్ యాక్షన్ ప్లాన్”తో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం

13-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గ్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్డు భద్రతపై గ్రామసభలు నిర్వహించబడినవి. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్లు పాల్గొని సూచనలు అందించారు. గడి పెద్దాపూర్ గ్రామపంచాయతీలో “99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించగా, సర్పంచ్ హరికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామ రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేసి, సర్పంచ్‌తో పాటు మొత్తం పది మంది సభ్యులను నియమించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్లతో వాట్సాప్ కాల్ ద్వారా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు, చిన్నచిన్న నిర్లక్ష్యాల వల్ల జరిగే ప్రమాదాలను టీవీ స్క్రీన్ ద్వారా చూపించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. కార్యక్రమం అనంతరం గ్రామంలోని రోడ్డు గుంతలను పూడ్చడం, రహదారులకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించడం వంటి చర్యలు గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో చేపట్టి రహదారులను సురక్షితంగా మార్చారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.

Sthanikam

“99 డేస్ యాక్షన్ ప్లాన్”తో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News