Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:26 AM

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

12-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌: హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని టీచర్స్‌ ఫేజ్‌–2 కాలనీలో వీధికుక్కలు చిన్నారిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట నుంచి వేసవి సెలవుల కోసం పిన్ని ఇంటికి వచ్చిన అద్విక్‌ అనే బాలుడిపై ఒక్కసారిగా సుమారు 8 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం రాత్రి 7.30 నుంచి 8 గంటల సమయంలో ఇంటి సెల్లార్‌ ప్రాంతంలో అద్విక్‌ ఆడుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రక్షించి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న హస్తినాపురం డివిజన్‌ తాజా మాజీ కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి, మన్సూరాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి, లింగోజిగూడ మాజీ కార్పొరేటర్‌ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలుడి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు.

Sthanikam

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News