Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

07-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద ప్రజలతో కలిసి బంజారాహిల్స్ నుండి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా జరిగిందని తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఇటీవల సిపిఎం పట్టణ కమిటీ పోరాట ఫలితంగా 700 సర్వే నెంబర్లులో అధికారులు వచ్చి సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమిగా, 18 ఎకరాలు పట్టాగా మొత్తం 38 ఎకరాలు ఉన్నదని తెలియజేశారని అన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనిన్నారు. ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక కిరాయిలు కట్టలేక పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇల్లు లేకపోతే ఆ బాధ వర్ణాతితం అనిన్నారు. గత 20 సంవత్సరాలుగా పోరాటాల నిర్వహిస్తున్న పట్టా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయించలేదని అన్నారు. ప్రజా పాలన అంటున్న ఈ ప్రభుత్వం కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. 700 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పట్టణంలోని పేద ప్రజలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడిసేవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు,సిపిఎం పట్టణ నాయకులు దండగిరి,కోటగిరి వీరబ్రహ్మం,కొత్త లక్ష్మయ్య,నరాల నరసింహ,పల్లెర్ల గంగయ్య,గుడిసేవాసుల కమిటీ సభ్యులు దొడ్డి శంకర్,నారి కలమ్మ, అరుణ,స్రవంతి,మౌనిక,మంజుల,స్వామి,యాదగిరి,హేమలత,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News