Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:10 AM

7 వారాల జాతరకు సిద్ధమైన నల్ల పోచమ్మ ఆలయం

22-04-2026 218 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ మంజీర నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి 7 వారాల మహా జాతరకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు 23-04-2026 గురువారం నుండి మొదటి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, ధ్వజారోహణం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులతో ఆలయం భక్తి వాతావరణంతో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్ప, జూనియర్ అసిస్టెంట్ శివానంద్, ఆలయ చైర్మన్ మల్లయ్య, అర్చకులు సిద్ధయ్య స్వామి, ఆలయ సిబ్బంది, పుల్లారెడ్డి తదితరులు, గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. రాబోయే 7 వారాల పాటు జరిగే ఈ మహా జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు భక్తులను ఆహ్వానించారు.

Sthanikam

7 వారాల జాతరకు సిద్ధమైన నల్ల పోచమ్మ ఆలయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News