Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:03 PM

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

18-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి – కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ఇం డియా డిమాండ్

ఆదోని: పట్టణంలోని దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫ్లైఓవర్) నేడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆదోని పట్టణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 1976–77లో పనులు ప్రారంభమై 1982లో రాకపోకలకు ప్రారంభమైన ఈ బ్రిడ్జి ప్రస్తుత ట్రాఫిక్ భారాన్ని మోయలేని స్థితికి చేరుకుందని నాయకులు పేర్కొన్నారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ ఆధ్వర్యంలో సహాయ కార్యదర్శి నారాయణ, కే. రమేష్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా సమితి సభ్యులు ఏ. విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ కార్యదర్శి జి. అంజి గౌడ్, పుష్పరాజ్, ఆర్. ఈరన్న తదితరులు బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అప్పట్లో వాహనాల రద్దీ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా పెరిగినా బ్రిడ్జి విస్తరణ జరగకపోవడం ఆందోళనకరమన్నారు.

బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, ఎక్కే దిగే ప్రాంతాల్లో ప్రమాదకర వంపులు, రాత్రివేళ తగిన వెలుతురు లేకపోవడం, తక్కువ ఎత్తులో రక్షణ గోడలు, భారీ వాహనాల రాకపోకలు వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుత ఫ్లైఓవర్‌కు తక్షణ సాంకేతిక భద్రతా పరీక్షలు నిర్వహించి, కొత్త డబుల్ లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News