Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

4వ వార్డులో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం

10-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బసవకళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగార్, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – వికాసం,విశ్వాసం, భద్రతకు ప్రతీకగా నిలిచిన భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజినీకాంత్‌కు ఓటు వేసి ఘన విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ పాలనలోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదల, పేదల సంక్షేమం వంటి అంశాల్లో బీజేపీ స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందని తెలిపారు.మాటలకన్నా పనుల ద్వారానే అభివృద్ధిని చూపిస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు.మున్సిపాలిటీలో బీజేపీ గెలిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే పాలన బీజేపీ పాలన మాత్రమేనని పేర్కొన్నారు.ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల్లో బీజేపీపై నమ్మకం మరింత బలపడిందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

4వ వార్డులో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News