Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

4వ వార్డు అభివృద్ధికై వడ్డేపల్లి యాదగిరిని గెలిపించండి - సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

05-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

4వ వార్డు అభివృద్ధికై సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారినే గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.

గురువారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోచంపల్లి పట్టణంలోని 4వ వార్డు నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటివరకు దేశాన్ని, రాష్ట్రాన్ని, మున్సిపల్ పట్టణాలను ఏలిన పార్టీలు అభివృద్ధి మరిచి మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించాలని అనడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటిదాకా పరిపాలన చేసిన పార్టీలు ఎందుకు పట్టణాలను అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు..? 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను స్పష్టంగా పేర్కొందని అందులో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ, విద్యా పరిరక్షణ, గృహ నిర్మాణము, రవాణా,మౌలిక వసతులు తీర్చవలసిన బాధ్యత ఆయా స్థానిక సంస్థలపైనే ఉంటుందని తేల్చి చెప్పారని కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వీటిని గాలికి వదిలాయని విమర్శించారు. పోచంపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. పట్టణంలో ఏ వార్డు చూసినా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు,వీధి లైట్లు లాంటి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. ప్రధానంగా 4వ వార్డులో ఎక్కువ శాతం దళితులు, పేదలు నివసిస్తున్నారని వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉపాధి, మురికి కాలువలు,సీసీ రోడ్లు లాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని,వార్డును ఆనుకొని స్మశాన వాటిక ఉన్నదని దానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇరుకు రోడ్లతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అన్నారు.వార్డులో ఉన్న ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే నిరంతరం ప్రజల ఉండి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారినే వార్డు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి,పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్,మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు,పట్టణ కమిటీ సభ్యులు పోన్నమోని కృష్ణ, బుగ్గ లక్ష్మయ్య,బొడిగ రాజన్ బాబు,పోతగల రామచంద్రం,గుర్ర బాలయ్య, నల్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

4వ వార్డు అభివృద్ధికై వడ్డేపల్లి యాదగిరిని గెలిపించండి - సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News