Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:49 AM

34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి

09-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంటెకార్ రఘుమోహన్ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, సబ్బండ జాతుల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలిపారు. స్థానికుడిగా, విద్యావంతుడిగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని పేర్కొంటూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం అవసరమని అన్నారు. బహుజనుల కోసం స్థాపించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో, వట్టే జానయ్య యాదవ్ సహకారంతో ముందుకు సాగుతూ వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీన్మార్ మల్లన్న బహిరంగ సభకు 34వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని కాంటెకార్ రఘుమోహన్ తెలిపారు.

Sthanikam

34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News