Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:08 PM

331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి ఇండ్ల తొలగింపునకు ఆర్టీవో కు వినతి

09-02-2026 334 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

331 ప్రొహిబిటెడ్ జాబితాలో దుబ్బాక ఇండ్లు

150 ఏళ్ల నివాసాలపై ‘నిషేధ’ ముద్ర

బ్యాంకు రుణాలు.. చదువులు.. వ్యాపారాలకు బ్రేక్

రామన్నపేట / దుబ్బాక :

దుబ్బాక గ్రామంలో తరతరాలుగా నివసిస్తున్న ఇండ్లను 331 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం వల్ల గ్రామ ప్రజల జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారింది. గత 150 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండ్లకు అకస్మాత్తుగా నిషేధ ముద్ర పడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ప్రొహిబిటెడ్ జాబితాలో ఇండ్లు ఉండటంతో పై చదువులు, చిన్న వ్యాపారాలు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం పూర్తిగా కోల్పోయామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికే బ్యాంకుల్లో మ్యాటికేషన్ అయిన ఇండ్లను కూడా రద్దు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఈ సమస్యపై స్పందించిన దుబ్బాక గ్రామ ప్రజలు అఖిలపక్ష ఆధ్వర్యంలో గురువారం రామన్నపేట ఎమ్మార్వో, ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. తాము నివసిస్తున్న ఇండ్లను 331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉపసర్పంచ్ గుండాల రమేష్, ఎక్స్ ఎంపీపీ నీల దయాకర్, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ, మాజీ ఉపసర్పంచ్ మేడి గణేష్లతో పాటుక్యాస వీరస్వామి, గుండాల సతీష్, గుండాల రమేష్, గుండాల రాంబాబు, పుట్టల స్వామి, కంబాలపల్లి ధనంజయ, నీల శంకరయ్య, మేకల కృష్ణ, జడల శాంతి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి ఇండ్ల తొలగింపునకు ఆర్టీవో కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News