Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్‌గా విక్రమ్

18-12-2025 321 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్‌గా విక్రమ్

వేదికపైకి పిలిచి అభినందించిన కేటీఆర్ – పార్టీ అండ ఎప్పుడూ ఉంటుందని భరోసా

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేవలం 33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన యువ నాయకుడు గర్ధాస్ విక్రమ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఘన సన్మానం చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విక్రమ్‌ను వేదికపైకి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ధాతపెళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగం యాదవ్‌లు యువ సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి విషయంలో పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, డేర్ అండ్ డాషింగ్‌గా పనిచేసే యువ నాయకులకు బీఆర్‌ఎస్‌లో మంచి భవిష్యత్ ఉంటుందని నేతలు పేర్కొన్నారు. యువ సర్పంచ్ విక్రమ్‌కు పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఇచ్చిన హామీతో మరింత ధైర్యం, ఉత్సాహం వచ్చిందని కార్యక్రమానికి హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్‌గా విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News